సీడీఎంఏ స్ప్రెక్ట్రమ్‌ ధర తగ్గించాలి కేంద్ర మంత్రి వర్గం సాధికార బృందం ప్రతిపాదన

న్యూఢిల్లీ, జనవరి 7 (జనంసాక్షి): సీడీఎంఏ స్పెక్టమ్ర్‌ ధరను తగ్గించాలని కేంద్ర మంత్రివర్గ సాధికర బృందం ప్రతిపాదించింది. వచ్చే మార్చిలో స్పెక్టమ్ర్‌ వేలం వేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే, కేంద్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకున్నాకే వేలం వేయనున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ తెలిపారు. స్పెక్టమ్ర్‌ ధరల నిర్ణయంపై చర్చించేందుకు కేంద్ర మంత్రివర్గ సాధికార బృందం సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. ఈ నెల 3న భేటీ అయిన మంత్రుల బృందం.. టెలికాం సంస్థ రూపొందించిన వేలం ప్రణాళికపై చర్చించింది. అయితే, 1800/900 మెగాహెడ్జ్‌ స్పెక్టమ్ర్‌ కేటాయింపులపై చర్చించినమంత్రులు సీడీఎంఏ కు చెందిన 800 మెగాహెడ్జ్‌పై చర్చించలేదు. దీనిపై సోమవారం నాటి భేటీలో చర్చించారు. సీడీఎంఏ స్పెక్టమ్ర్‌ ధర తగ్గించాలని మంత్రుల బృందం నిర్ణయించింది. అయితే, తుది నిర్ణయాన్ని కేంద్ర క్యాబినెట్‌ తీసుకుంటుందని సిబాల్‌ తెలిపారు. భేటీ అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. 800 మెగాహెడ్జ్‌పై కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న తర్వాత.. స్పెక్టమ్ర్‌ రెండో విడత వేలం మార్చ్‌లో ప్రారంభం కానుందని చెప్పారు. అన్ని సర్కిళల్లోని 800 మెగాహెడ్జ్‌కు బిడ్డింగ్‌ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. సీడీఎంఏ స్పెక్టమ్ర్‌ ధరలను భారీగా తగ్గించాలని మంత్రివర్గ సాధికార బృందం నిర్నయించినట్లు తెలిసింది. దఆదాపు 30-50 శాతం మేర తగ్గించాలని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, తుది నిర్ణయం మాత్రం తీసుకోనుందని, ఆ తర్వాత మార్చి 11న వేలం ప్రారంభం కానుందని ఆ వర్గాలు వెల్లడించాయి.