*సీనియర్ రిపోర్టర్ కు ఎమ్మెల్యే గండ్ర పరామర్శ.
చిట్యాల27(జనంసాక్షి)సీనియర్ రిపోర్టర్, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కట్కూరి మొగిలి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఇంటికి రాగా సమాచారం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జడ్పిటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ రాంబాబు, మండల కో ఆప్షన్ సభ్యులు రాజ్ మహమ్మద్ పలువురు పాల్గొన్నారు.