సీమాంధ్ర్ర మీడియా ప్రచారం సొల్ల హోంశాఖ నివేధికలు డొల్ల..?

అది వంద కోట్ల ప్రజలకు, వారి భద్రతకు ప్రాతినిధ్యం వహించే హోంశాఖ. దేశ భద్రతకు సంబందించిన అంశాలలో అది ఎన్నో నివేదికలను రూపొందిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. దేశ అంతర్గత భద్రత విషయంలో హోంశాఖ  నివేదికలు, అత్యంత రహస్యమైనవి. అత్యంత గోప్యమైనవి. ఇవి ఎట్టిపరిస్థితుల్లోనూ బహిర్గతం కావు. దీని వల్ల దేశానికి ముప్పు పొంచి ఉంటుంది. ఈ రక్షణ నివేదికలు సెక్యూరిటీ కోణంలో చాలా రహస్యమైనవి. వీటిలో ఏం అంశాలు ఉంటాయో నివేదికలు రూపొందించే వారికి, ఎవరికైతే ఇస్తారో వారికి తప్ప ఇంకెవరికీ తెలియవు. వీటిని సహచట్టం ద్వారా కూడా తెలుసుకొనే అవకాశం లేదు. కానీ హోంశాఖ దేశ రాష్ట్రపతికి ఇవ్వడానికి ఓ నివేదికను రూపొందిస్తోందని, అందులో తెలలంగాణ రాష్ట్రం ఇవ్వడం సాధ్యం కాదనే అంశం ఉన్నట్లు సీమంధ్ర చానెళ్లు చంకలు గుద్దుకొంటున్నాయి. ఇక్కడ మనం రెండు అంశాలను మనం గమనించాలి. మొదటిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీవ్రంగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజలను మరింత గాయపర్చి తెలంగాణ బిడ్డల ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేసి వారు ఆత్మహత్యలు చూసి పైశాచిక ఆనందం పొందాలన్నది వారి ఉద్దేశ్యం, వారి లక్ష్యం. రెండోది దేశ ఆంతరంగిక భద్రతకు సంబంధించిన రహస్య నివేదికలు అంత సులువుగా బహిర్గతం కావడం వారి భద్రతలో, రహస్యాలను కాపాడడంలో హోంశాఖ డొల్లతనాన్ని భయటపెడ్తుంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాష్ట్రపతికి నివేదిక ఇచ్చేందుకు కేంద్ర హోంశాఖ రూపొందిస్తున్న  నివేదిక ఇంకా పూర్తికాలేదు. అలాంటిది అపుడే ఈ నివేదికలోని అంశాలు లీకవడమే విశేషమయితే, అదే రోజు మీడియాకు చేరడం మరో విశేషం. ఇది సాధారణంగా జరుగదు. అత్యంత భద్రంగా, గోప్యంగా ఉండాల్సిన నివేదిక ఒక వేళ నిజంగానే లీకవడం జరిగితే  వెంటనే కేంద్ర హోంమంత్రి చిదంబరం, అధికారులు రాజీనామా చేయాల్సిందే. వంద కోట్ల ప్రజలకు, వారి భద్రకు భరోసా ఇవ్వాల్సిన  హోంశాఖ అత్యంత గోప్యంగా దేశ ప్రథమ పౌరుడికి  ఇవ్వాల్సిన నివేదిక మీడియాకు లీకయిందంటే అది హోంశాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట. చాలా గోప్యంగా ఉంచాల్సిన ఇలాంటి విషయాలు మీడియాకే లీకయితే దేశంలో, దేశ సరిహద్దు ఆవల అవకాశం కోసం కాచుకొని కూర్చొనే ఐఎస్‌ఐ సంగతేంటి. ఈ లీకులు అక్కడి దాకా చేరకుండా ఉంటాయా..? ఒకవేళ చేరితే అందులోని  అంశాల గురించి వారికి పూర్తి నివేదికలు లభించినట్లే దీనివల్ల దేశ ప్రజల భద్రత సంగతేంటి..? ఇప్పటికైనా కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం అసలీ లీకు జరిగిందో లేదో తేల్చాలి. 2009లో తెలంగాణ ఇవ్వద్దని ఐబీ ఓ నివేదికను కేంద్ర హోంశాఖకు ఇచ్చినప్పటికీ చిదంబరం డిసెంబర్‌9 ప్రకటన ఇచ్చాడు. కాబట్టి తెలంగాణ ప్రజలు నిజమో కాదో తెలియని సీమాంధ్ర చానెళ్ల సొల్లు వార్తలు విని ఆత్మస్థైర్యం కోల్పోవద్దు…తెలంగాణ బిడ్డల ఆత్మస్థైర్యం దెబ్బతీసి విద్యార్థుల ఆత్మహత్యలు కళ్ల చూద్దామనుకొనే సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆటలు సాగనీయకూడదు…తెలంగాణ ప్రజలు మడమ తిప్పకుండా పోరాడాలి..కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ సాధించుకోవాలి.