ముల్కనూర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
భీమదేవరపల్లి:ఏప్రిల్ 17 (జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.మండలంలోని ముల్కనూర్ అంబేద్కర్ కూడలి వద్ద శుక్రవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా
కొలుగూరి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు దశాబ్దాల పాటు నిరంతరం పోరాటం చేసి అనేకమంది అమరుల త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రం సాధించబడిందని ఆయన తెలిపారు. అలాంటి పవిత్రమైన ఉద్యమాన్ని రాష్ట్ర ఏర్పాటును తక్కువ చేసి చూపే విధంగా వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని అన్నారు.ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో నూ సహించబోమని స్పషం చేశారు అనఅనంత
జేఏసీ కన్వీనర్ కవ్వా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, 1200 మంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్–3 ప్రకారం, సోనియా గాంధీ రాజకీయ సంకల్పం, సుష్మా స్వరాజ్ మద్దతుతో పార్లమెంట్‌లో మెజార్టీ ఎంపీల ఆమోదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు.ఇలాంటి రాష్ట్ర ఏర్పాటును అవమానించే వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన హెచ్చరించారు.
మండల జేఏసీ చైర్మన్ డేగల సారయ్య మాట్లాడుతూ, తెలంగాణను భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయినట్లుగా పోల్చడం అమరుల త్యాగాలను అవమానించడం మాత్రమే కాకుండా ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు.ఈ విషయంపై తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు మౌనం పాటించడం కూడా ఖండనీయమని అన్నారు.
ఇప్పటికే రాష్ట్ర ఏర్పాటుకు దాదాపు 12 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ డిలిమిటేషన్ వంటి కీలక అంశాలపై చర్చ జరగాల్సిన సమయంలో రాష్ట్ర ఏర్పాటుపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని నాయకులు విమర్శించారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ కవ్వా లక్ష్మారెడ్డి,మండల జేఏసీ చైర్మన్ డేగల సారయ్యతో పాటు అఖిలపక్ష నాయకులు కొలుగూరి రాజు, మండల సురేందర్, జక్కుల అనిల్, మాడుగుల అశోక్, డబ్బా శంకర్, రేణిగుంట్ల బిక్షపతి, రచ్చ సంపత్,దస్తరి ఉమామహేశ్వర్,బేరే యాదగిరి,మాడుగుల పోచయ్య,అంబాల రాజు,ఒగ్గే శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


