రిటైర్డ్ ఆర్మీ జవాన్ ధైర్యం చైన్ స్నాచర్ పట్టుబడి సన్మానం
అంబర్‌పేట ఏప్రిల్ 17( జనం సాక్షి ):అంబర్‌పేట పరిధిలో చైన్ స్నాచింగ్‌కు యత్నించిన నేరస్తుడిని ధైర్యంగా పట్టుకున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అభినందించారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో ఆయనకు శాలువా కప్పి నగదు బహుమతి అందజేశారు.ఈ నెల 14న ఇరానీ హోటల్ బస్టాప్ వద్ద రాముడు మెడలోని గొలుసు లాక్కోవడానికి ప్రయత్నించిన నిందితుడిని ఆయన ప్రతిఘటించి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడు అబ్దుల్ మన్నన్‌గా గుర్తించగా, ఇతనిపై తెలంగాణ వ్యాప్తంగా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.


