సీమాంధ్ర సర్కారుకు నూకలు చెల్లాయి

పతనమంచున కిరణ్‌ కేబినెట్‌
నాగం జోస్యం
హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి): సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ప్రభుత్వం కూలిపోతుందని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని రైతులకు ఏడు గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేయాలని తెలంగాణ నేతలు అడిగినందుకు వారిని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వం చేసిన ఈ దుశ్చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ కావాలని అడగడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. సీఎంను కలిసి ఈ విషయంపై నిలదీస్తానని ఆయన తెలిపారు. విద్యుత్‌ సరఫరా విషయంలో సరియైన స్పందన లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.