సుప్రీం సరైన తీర్పునిచ్చింది: ఉజ్వల్‌ నికమ్‌

న్యూఢిల్లీ: ముంబయిలో జరిగిన దాడులు పాకిస్థాన్‌ నుంచి జరిగినట్లు సుప్రీం కోర్టు నిర్థారించిందని న్యాయవాది. ఉజ్వల్‌ నికమ్‌ తెలియజేశారు.  ఈ కేసులో కసబ్‌కు వ్యతిరేకంగా కింది కోర్టులో ఉజ్వల్‌ నికమ్‌ వాదనలు వినిపించారు. ఉరిశిక్షను ఖరారు చేస్తూ కోర్టు సరైన తీర్పును వెలువరించిందని ఆయన అన్నారు. ఉగ్రహవాదులకు సంబంధించిన కేసులో సుప్రీం తీర్పు ఇంత త్వరగా రావటం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.