సురక్షితమైన నీరు, పారిశుద్ధ్యం పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి

సురక్షితమైన నీరు, పారిశుద్ధ్యం పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి
వరంగల్ ఈస్ట్ మార్చి 22 (జనం సాక్షి)
31వ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా స్థానిక ఏ వి వి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కొడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో” నీటి పొదుపు మరియు పారిశుధ్యం “పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.  ఈ సందర్భంగా వాలంటీలను ఉద్దేశించి కోడిమాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మన చుట్టూ నీరు 75% ఉన్న మనకు అందుబాటులో మూడు శాతం మాత్రమే వివిధ రూపాల్లో అందుబాటులో ఉన్నాయని కావున నీటిని పొదుపు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ,తద్వారా భావితరాలకు మంచి నీటిని అందించిన వారు అవుతామని మరియు ఈ ఈ సంవత్సరము యు .ఎన్ .ఓ వారు పరిశుభ్రమైన నీరు మరియు పారిశుధ్యం పై ప్రజల్లో అవగాహన , చైతన్యవంత మైన కార్యక్రమాలు చేయాలని సూచించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వాలంటీర్లు విష్ణు, ఇమ్రాన్, జగదీష్, ప్రమోద్, ఎండి సమీర్, దీపక్, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.