సూరీడు ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  వ్యక్తిగత సహాయకుడు సూరిడు ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. జూబ్లీహిల్స్‌ గాయత్రినగర్‌లోని సూరీడు నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయ్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రిపుంజయ్‌రెడ్డి, సూరీడులు కలిసి ఆస్తులు కూడబెట్టారని చెప్పారు.

తాజావార్తలు