సెప్టెంబర్‌ 20వ నుంచి దేశ అంతర్గత భద్రతపై సదస్సు

న్యూఢిల్లీ: దేశ అంతర్గత భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు, సరిహద్దుల రక్షణపై సెప్టెంబర్‌ 20వ తేదీ నుంచి ఢిల్లీలో రెండు రోజుల సదస్సు జరగనుంది. వెబ్‌సైట్ల హ్యాకింగ్‌, ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్‌ సేవల దుర్వినియోగం వంటి అంశాలపై కూడా సదస్సులో చర్చించనున్నారు. జాతీయ భద్రతా ఉప సలహాదారు విజయలతారెడ్డి, సీఈఆర్‌టీ డైరెక్టర్‌ జనరల్‌ గుల్షన్‌ రాయ్‌, కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నిర్మల్‌జిత్‌సింగ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు,