సేంద్రియ ఎరువుల తయారీలో అశ్రద్ద


రసాయన వినియోగాలకే మొగ్గు
పెరుగుతున్న ఖర్చులను పట్టించుకోని రైతు
సంగారెడ్డి,ఆగస్ట్‌16(జనంసాక్షి): సేంద్రీయ ఎరువుల వాడకం పెంచేందుకు ప్రభుత్వం ఉపాధి హావిూ పథకం
ద్వారా ప్రోత్సహిస్తున్నా రైతుల్లో అవగాహన కల్పించకపోవడంతో కనీసం నిర్దేశిరచిన లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోతున్నారు. ఉపాధి హావిూ పథకం ద్వారా గుంతల నిర్మాణం చేపట్టుకుంటే రైతులకు వ్యయం భారం తగ్గడమే కాకుండా సేంద్రీయ ఎరువులను తయారు చేసుకోవచ్చని అధికారులు అన్నారు. అయితే అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరక పోవడంతోపాటు రైతులకు ప్రయోజనం లేకుండా పోతుంది.పంట పొలాల్లో రసాయనిక ఎరువులు
తగ్గించాలని ప్రచారం చేయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉచితంగా రైతులకు ఉపాధి హావిూ ద్వారా నిర్మాణాలు చేపడుతున్నా అధికారుల పర్యవేక్షణతోపాటు నిర్లక్ష్యంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. అధికారులు దృష్టి సారించకపోవడంతో కనీస లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు.ప్రభుత్వం ఉపాధి హావిూ పథకం రైతుల ఇళ్లలో నాడేప్‌ కంపోస్టు గుంతల కింద గుర్రపు నాడల గుంతల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించినా ఎక్కడా పూర్తి కాకపోవడంతో లక్ష్యం చేరుకోలేక పోతున్నారు. గుంతలను సద్వినియోగం చేసుకుంటే రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా మారనుంది. సేంద్రీయ ఎరువు తయారీ చేయుటకు రైతుల భూమిలోని చెత్తను, ఇళ్ల పరిసరాల్లోని చెత్తను కంపోస్టు గుంతలో ఒకసారి మూడు వరసలో చెత్తను వేసి చేసుకునేలా సూచనలు చేస్తున్నారు. గుంత నింపిన తరువాత దానిపై గోనె సంచులు వేసి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇలా మూడు, నాలుగు నెలల్లో సేంద్రీయ ఎరువు తయారవుతుంది. ఇలా ఎరువు తయారీ చేసుకోవడంతో రసాయనిక ఎరువులను తగ్గించడమే కాకుండా భూసారాన్ని పెంచుకుని అధిక దిగుబడులు సాధించుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కంపోస్టు గుంతల నిర్మాణాలపై ఇప్పటికే అవగాహన కల్పించారు. అయినప్పటికీ రైతులు ముందుకు రావడంలేదు. మరింత అవగాహన కల్పించి నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.