సొసైటీ ఆవరణలో పాలకవర్గ సమావేశం

ఖానాపురం సెప్టెంబర్ 24జనం సాక్షి
 మండలంలో కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్  అధ్యక్షతన సొసైటీ పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈనెల 30వ తేదీన సాధారణ మహాజన సభా  నిర్వహిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు . అలాగే ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. మనుబోతుల గడ్డ కొత్తూరు గ్రామాల్లో ప్రహరీగోడ తో పాటు కొత్త గోదాముల నిర్మాణం కొరకు తీర్మానం చేసినట్లు తెలిపారు. అలాగే కొత్త పంట రుణాలు ఇచ్చుటకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ వేణు కృష్ణ, సీఈవో ఆంజనేయులు, డైరెక్టర్లు సునీత,భాగ్యమ్మ,సాంబయ్య,రాజు,తిరుపతి,లక్ష్మణ్,రమేష్, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.