సోదరిని వేధింపులకు గురిచేస్తున్నాడనే కారణంతో బావను హత్య చేసిన : బావమరుదులు

నిజామాబాద్‌: తన సోదరిని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడనే కారణంతో బావను చంపిన బావమరదులు ఈ ఘటన కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి అతని భార్య కొండమ్మను తరుచు వేధింపులకు గురిచేసేవాడు. వారం రోజుల క్రితం ఆమెతో తీవ్రంగా గొడవ పడిన విషయం కొండమ్మ సోదరులకు తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు బావమరదులు శుక్రవారం రాత్రి మరో ఇద్దరితో వచ్చి వెంకటేశ్వర్‌రెడ్డిపై కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు నిజామాబాద్‌కు తరలిస్తుండగా మరోసారి అడ్డుకొని దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు.