‘సోనియా విదేశీ పర్యటనే ‘తెలంగాణ ‘పై ప్రకటన ఆలస్యం’

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశీ పర్యటనలో ఉన్నందునే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన ఆలస్యమైందని రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్దన్‌రెడ్డి అన్నారు. సోనియా దేశంలోనే ఉండివుంటే ఈపాటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ప్రకటన వచ్చేదన్నారు. తెలంగాణ అంశంపై సోమవారం కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యాలను మీడియా వక్రీకరించిదని పాల్వాయి తెలియజేశారు.