స్వచ్ఛంద సేవా సంస్థ వెబ్ సైటు ప్రారంభించిన మంత్రి జగదీశ్ రెడ్డి
తిరుమలగిరి (సాగర్), సెప్టెంబరు 10( జనంసాక్షి):
శనివారం హైదరాబాదు లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర విద్యుత్త్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నాగార్జున సాగర్ నియెజకవర్గంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న ఏకే ఫౌండేషన్ వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ గ్రామీణ నిరుద్యోగ యువతి యువకుల కోసం, పేద వర్గాల కోసం పలు స్వచ్చంధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ యాదవ్ సేవలను కొనియాడారు,గ్రామీణ యువత ఇలాంటి స్వచ్చంధ సంస్థ కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యి సంస్థ యొక్క సేవలను విసృత్తం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ యాదవ్, ఎన్నారై గుండెబోయిన శ్రీనువాస్ యాదవ్, సాప్ట్వేర్ ఇంజనీర్ మాదగోని మల్లిఖార్జున్ గౌడ్, మన్నెం కోటేష్ తదితరులు పాల్గోన్నారు.