స్వర్ణపతకం గెలవలేదని అమ్మ నిరాశపడింది : గగన్‌

లండన్‌ఒలింపిక్స్‌ క్రీడల్లో స్వర్ణపతకం సాధించలే దని అమ్మ నిరాశకు లోనయ్యారని హైదరాబాద్‌ షూటర్‌ గగన్‌నారంగ్‌ అభిప్రాయపడ్డారు. ఈ క్రీ డల్లో కాంస్య పతకం సాధించిన గగన్‌నారంగ్‌కు పూణేలోని గన్‌ఫర్‌గ్లోరీ అవార్డును మహారాష్ట్ర ప్ర భుత్వం సన్మానించింది. ఈసందర్భంగా గగన్‌ నారంగ్‌మాట్లాడుతూతానుస్వర్ణంగెలుస్తాననిఅమ్మ భావించిందనీ, కానీ కాంస్యం మాత్రమే దక్కడం తో ఆమెఅసంతృప్తి వ్యక్తంచేశారన్నారు. భవిష్యత్‌ లో తల్లికోరిక తీరుస్తానని మాటఇచ్చాడు. లండ న్‌ ఒలింపిక్స్‌లో తాను పోటీచేసిన 10మీటర్ల ఎ యిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో ఒత్తిడికి లోనయ్యాని గు ర్తుచేసుకున్నాడు. ఈఒత్తిడిని తగ్గించుకునేందుకు గాను కోచ్‌ స్టానిస్లాన్‌లాపిడన్‌ ఐప్యాడ్‌తో కాలక్షే పంచేశానన్నాడు.