హత్యకు కుట్ర పన్నారని 11మంది అరెస్టు

బెంగళూరు: ప్రముఖ కన్నడ దినపత్రిక విలేకరిని హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న అనుమానంతో 11మందిని బెంగళూరు నగర పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక ఆంగ్ల దినపత్రిక విలేకరి ఉండటం గమనార్హం. అరెస్టయిన వారికి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ మిర్జి తెలిపారు. వీరి వద్దనుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు.