హనుమాన్ దేవాలయంలో చోరీ
కుత్బూల్లాపూర్ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని నర్సపూర్ అర్ అండ్ బీ రోడ్డు పక్కన గల హనుమాన్ దేవాలయంలో చోరీ జరిగింది. శుక్రవారం రాత్రి దోంగలు అలయతాళాలు పగులగోట్టి పూజ సామాగ్రితోపాటు ఎలక్రికల్ వస్తువులు అపహరించుకుపోయారు. వీటి విలువ రూ. పది వేల వరకు ఉంటుందని అలయ అర్చకులు తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలిసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.