హన్మకొండలో పోలీసుల 5 కెరన్‌

వరంగల్‌: వరంగల్‌ నగర పోలీసులు హాన్మకొండలో 5కెరన్‌ నిర్వహించారు. అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు శ్యాంసుదర్‌, రాజేష్‌ కుమార్‌ ఈ రన్‌ ముందుండి నడిపించారు. మహ్మాకొండ పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి అమర వీరుల స్థూపం వరకు ప్రజలతో కలిసి జిల్లా ఎస్పీలు, నగర కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ ఈ రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా నగరంలో 5కె రన్‌ను నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలియజేశారు.