హీరాగోల్డ్‌ బాధితులు పిర్యాదులు స్వీకరిస్తాం

నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడి
హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  హీరాగోల్డ్‌ బాధితులకు నగర కమిషనర్‌ అంజనీకుమార్‌ పిలుపునిచ్చారు. సోమవారం విూడియాతో మాట్లాడిన ఆయన హీరా గోల్డ్‌ బాధితులు.. నగరంలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఆయా స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించారు. తిరస్కరిస్తే బాధితులు తనకు ఫిర్యాదు చేయవచ్చరని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. కాగా తిరుపతికి చెందిన హీరా గోల్డ్‌ సంస్థ .. తెలుగు ప్రజల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు కట్టించుకోని తిరిగి చెల్లించలేదు. దీంతో బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆ సంస్థ సీఈవో నౌహీరా షేక్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. తాజాగా ఇదే కేసులో ట్రావెల్‌ పాయింట్‌ అధినేత ఖాజీ నిజామొద్దీన్‌ను అరెస్ట్‌ చేశారు. ఖాజీ నిజామొద్దీన్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిజామొద్దీన్‌పై ఇప్పటికే రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేశారు పోలీసులు.