హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్‌ పోటీలకు ఆటంకం

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో జరుగుతున్న జాతీయ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో చివరిరోజు పోటీలకు భారీ ఈదురుగాలులు ఆటంకం కలిగించాయి. 20నాటికల్‌ మైళ్ల వేగంతో వీసిన గాలులకు దాదాపు 20పడవలు బోల్తాపడ్డాయి. వీటిని యుధాస్థితికి తెచ్చేందుకు సెయిలర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో జరుగుతున్న జాతీయ లేజర్‌ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌ చివరి దశకు చేరుకుంది. నాలుగు రోజులుగా అనుకూల వాతావరణంలో సజావుగా సాగిన ఛాంపియన్‌ షిప్‌కు చివరి రోజు మాత్రం ఈదురుగాలులు ప్రతికూలంగా మారాయి. చివరిరోజు పోటీల్లో వివిధ విభాగాల్లో సాగిన రేసులకు 20నాటికల్‌ మైళ్ల వేగంతో వీచిన గాలులు ప్రతిబంధకంగా మారాయి. గాలుల ఉద్దృతికి సాగర్‌లో అలలు ఎగసిపడ్డాయి. కొన్ని పడవలు కొట్టుకుపోయాయి. వాస్తవానికి ఎనిమిది నాటికల్‌ మైళ్ల వేగంతో వీచే గాలులు సెయిలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. ఈఅ సీజన్‌లో పరిమితికి మంచిన గాలులు వీయడం కూడా ఇదే మొదటిసారి.