హైదరాబాద్ పర్యటనలో అమెరికా రక్షణ సహాయ మంత్రి
హైదరాబాద్: అమెరికా రక్షణ శాఖ సహాయ మంత్రి ఆస్థాన్ బి కార్టర్ హైదరాబాద్‌ను సందర్శించారు. పదిరోజుల ఆసియా-పసిఫిక్ ప్రాంత పర్యటనలో భాగంగా ఆయన నగరానికి వచ్చారు. గత నెలలో ఢిల్లీ వచ్చిన అమెరికా రక్షణ మంత్రి లియోన్ పానెట్టా ఇరుదేశాల మధ్య రక్షణ, వాణిజ్య బందాల పట్టిష్టానికి ఇచ్చిన హామి మేరకు ఇప్పుడు కార్టర్ భారత్‌లో పర్యటిస్తున్నారు. నానక్ రాంగూడలోని ఇన్‌ఫోటెక్ లెర్నింగ్ సెంటర్‌లో ఆయన భారత రక్షణ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.