హైదరాబాద్ డ్రోన్లు పాక్‌లో విధ్వంసం సృష్టించాయి
` డ్రోన్ టెక్నాలజీలో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధించింది
` హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్‌కు ఎస్తోనియా సహకారం తీసుకుంటాం
` వాణిజ్యం, ఏఐ సాంకేతికత, సైబర్ సెక్యూరిటీలో కూడా కలిసి పనిచేయాలి
` సచివాలయంలో ఆ దేశ వాణిజ్య ప్రతినిధుల బృందంతో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ
` ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండెడ్ మద్యం ఉత్పత్తి రంగాల్లో రాష్ట్రం ముందంజ
హైదరాబాద్(జనంసాక్షి): డ్రోన్ టెక్నాలజీలో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధించిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లో తయారైన డ్రోన్లు ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్‌కు భారీ నష్టం కలిగించాయని చెప్పారు. ఎస్తోనియా దేశ రాయబారి మ్యారియే లూప్ ఆధ్వర్యంలో ఆ దేశ వాణిజ్య ప్రతినిధుల బృందంతో సచివాలయంలో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ-గవర్నెన్స్, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్‌లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా సహకారం తీసుకుంటామన్నారు. వాణిజ్యం, ఏఐ సాంకేతికత, సైబర్ సెక్యూరిటీలో కూడా కలిసి పనిచేయాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని మంత్రి కోరారు.ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండెడ్ మద్యం ఉత్పత్తి రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని.. తమతో కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. సెప్టెంబరులో తమ దేశం సందర్శించాలని శ్రీధర్‌బాబును ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్ కోరారు. తమ అధికారుల బృందం వచ్చి.. విద్య, ఈ-గవర్నెన్స్, ఏఐ, రోబోటిక్స్‌లో పరస్పరం సహకారంపై చర్చిస్తుందని మంత్రి తెలిపారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక సీఎస్ సంజయ్ కుమార్, మీ సేవ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో వృత్తి విద్య కళాశాలల్లో ఫీజుల నిర్ధారణకు కమిటీ
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలోని వృత్తి విద్య కళాశాలల్లో ఫీజుల నిర్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్‌గా ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్టారెడ్డిని నియమించింది. దీంతో పాటు మరో 9 మందిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లోని కళాశాల్లో ఫీజు విధానాలు, పాటిస్తున్న ప్రమాణాలు, సౌకర్యాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు
` నియమించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఉమ్మడి జిల్లాలు – ప్రత్యేక అధికారులు వీరే.. హైదరాబాద్ – ఇలంబర్తి,రంగారెడ్డి – డి. దివ్య,ఆదిలాబాద్ – సి. హరికిరణ్,నల్గొండ – అనితా రామచంద్రన్,నిజామాబాద్ – ఆర్. హనుమంతు,మహబూబ్‌నగర్ – రవి,కరీంనగర్ – సర్ఫరాజ్ అహ్మద్,వరంగల్ – కె. శశాంక,మెదక్ – ఎ. శరత్, ఖమ్మం – కె. సురేంద్ర మోహన్
అశ్లీల కంటెంట్ యాప్‌లపై కొరడా
` నిషిధించిన కేంద్రం ప్రభుత్వం
` నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
న్యూఢల్లీి(జనంసాక్షి):అశ్లీల కంటెంట్‌ని ప్రసారం చేస్తున్న యాప్‌లపై కేంద్రం కొరడ రaుళిపించింది. ఉల్లు, ఎఎల్‌టిటి సహా 24 యాప్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 24 యాప్‌లు, వెబ్‌సైట్లపై నిషేధం విధించిన కేంద్రం.. ఆ వెబ్‌సైట్లు, యాప్‌లు ఇంటర్నెట్‌లో కనిపించకుండా చేయాలని ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఆదేశించింది ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఒటిటి ప్రసార యాప్‌లు, వాటి సర్వీస్ ప్రొవైడర్లు తాము ప్రసారం చేసే కంటెంట్ విషయంలో బాధ్యతయుతంగా ఉండాలని పేర్కొంది. చట్టాలను ఉల్లంఘించే కంటెంట్‌ను ప్రసారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఉల్లు, ఎఎల్‌టిటి, బిగ్ షాట్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్-టైన్‌మెంట్, లుక్ ఎంటర్-టైన్‌మెంట్, హిట్ ప్రైమ్, ఫినియో, షో ఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టివి, హాట్‌ఎక్స్ విఐపి, హల్‌చల్ యాప్, మూడ్‌ఎక్స్, నియాన్‌ఎక్స్ విఐపి, ఫ్యుగి, మోజ్‌ఫిక్స్, -టైప్లిక్స్ వంటివాటిని నిషేధించారు.దేశంలో అశ్లీల కంటెంట్‌పై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఏదో ఒక మార్గంలో ఆ కంటెంట్‌ని ప్రసారం చేస్తున్నారు కొందరు. కొందరైతే.. అశ్లీల కంటెంట్ కోసం ఏకంగా యాప్స్‌ని తయారు చేసి.. దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు.