హోంమంత్రి షిండేతో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ: గవర్నర్‌ నరసింహన్‌ రెండో రోజు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో గవర్నర్‌ భేటీ అయ్యారు. భేటీలో శాంతిభద్రతలపై చర్చిస్తున్నట్లు సమాచారం గురువారం సోనియా, ప్రధాని, హమీద్‌ అన్సారీలతో గవర్నర్‌ భేటీ అయిన విషయం తెలిసిందే.