ంండ్రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు మరో రెండ్రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో ,నైరుతి బంగాళాఖాతంలో రుతుపవనాలు విస్తరించాయి. ఈ నెల రెండో వారంలో ఇవి మన రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. మరోవైపు ఒడిశా నుంచి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.