అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన ఎంపిటిసి లక్ష్మీపతి గౌడ్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై20(జనంసాక్షి):-యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని ఎంపిటిసి లక్ష్మీపతి గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. గర్భిణీలకు బాలింతలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని సరఫరా చేసి పోషకాలతో కూడిన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ  ప్రభుత్వం ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ సరఫరా చేస్తున్న బియ్యంలో నాణ్యత లోపించిందని ఆవేదన వ్యక్తంచేశారు నాసిరకం బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉండడంతో అంగన్వాడి కేంద్రాల నిర్వహకులు వాటినే వండి పెడుతున్నారని తెలిపారు. పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తేనే గర్భిణీలకు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు బాలింతలకు చిన్నపిల్లలకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నల్లవెల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో సరఫరా చేసిన బియ్యంలో నాణ్యత లోపించిందని ఇప్పటికైనా నాణ్యతతో కూడిన బియ్యాన్ని సరఫరా చేయాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.