అంగన్వాడి కేంద్రాలకు సోలార్ ఏర్పాటుకు కృషి

 పిట్లం సెప్టెంబర్ 19( జనం సాక్షి)
 పిట్లం మండల కేంద్రంలోని 58 అంగన్వాడి కేంద్రాలకు సోలార్ ఏర్పాటుకు కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పేర్కొన్నారు.పిట్లం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నాడు సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు. సమావేశానికి ఎంపీపీ కవిత విజయ్ అధ్యక్షతన ప్రారంభించారు. పిట్లం మండలంలోని ఐసిడిఎస్ సూపర్వైజర్లు కళావతి,పద్మ అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ సరఫరా లేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లగా విద్యుత్ అధికారులతో మాట్లాడి సోలార్లకు ఎంత ఖర్చవుతుందో ఎస్టిమేషన్ వేసి ఇవ్వాలని ఆయన కోరారు. త్వరలోనే ప్రతి అంగన్వాడి కేంద్రంలో ప్రీజ్ సోలార్ను ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తిమ్మా నగర్ రాంపూర్ కుర్తి గ్రామాలలో విద్యుత్ స్తంభాల గురించి ఏడిని సర్పంచులు ప్రశ్నించగా కాలనీ కాలనీవాసులు 20 శాతం రుసుము చెల్లిస్తే ఆయా కాలనీలో శాఖపరంగా స్తంభాలను ఏర్పాటు చేస్తానని తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా రాంపూర్ గ్రామానికి ఎల్సి లైన్ ఏర్పాటు చేయమని విన్నవించిన ఇప్పటివరకు ఎందుకు చేయలేదని సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు నారాయణరెడ్డి నిలదీశారు. ఎల్ సి లైన్కు నాలుగు స్తంభాలు అవసరం ఉన్నాయి వారం రోజుల్లో స్తంభాలు ఏర్పాటు చేసి ఎల్సి లైను ఇస్తామని ఏడి హామీ ఇచ్చారు. ఐకెపి సంఘాలకు మహిళలకు కావలసిన రుణాలు సక్రమంగా అందించాలని ఐకెపి ఎపిఎం శిరీష కు ఆదేశించారు. మిగతా శాఖలు ఆనవాయితీగా మాటలు చెప్పి వెళ్లిపోయారు. జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, డిసిసిబి డైరెక్టర్ సాయి రెడ్డి, దేవేందర్ రెడ్డి, తాసిల్దార్ రామ్మోహన్ రావు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.