అంగన్వాడీల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి – అంగన్వాడి టీచర్లుగా, ఆయాలుగా ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు అందజేత – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

 

 

 

 

 

హుజూర్ నగర్ డిసెంబర్ 12 (జనంసాక్షి): అంగన్వాడీల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లుగా, ఆయాలుగా నూతనంగా నియామకమైన వారికి నియమక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన అంగన్వాడి కార్యకర్తలు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలన్నారు. మాతా శిశు రక్షణ సంరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ అంగన్వాడీల ద్వారా అందించే సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించాలన్నారు. ప్రభుత్వం అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఉద్యోగాలు పొందిన అంగన్వాడి టీచర్లు ఎమ్మెల్యే సైదిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, రైతు సంఘం సమన్వయ జిల్లా కమిటీ చావా వీరభద్రరావు, నియోజకవర్గ కార్మిక సంఘం అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్, అంగన్వాడి టీచర్లు, అంగన్వాడి ఆయాలు తదితరులు పాల్గొన్నారు.