అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం
గరిడేపల్లి, సెప్టెంబర్ 19 (జనం సాక్షి): కీతవారిగూడెం సెక్టార్ కాల్వపల్లి జిపి 1,2 అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసంలో భాగంగా గర్భవతులకు శ్రీమంతాలు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినారని తెలిపారు. తక్కువ ఖర్చులో ఎక్కువ పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలు ఆకుకూరలు పండ్లు గర్భవతులు బాలింతలు పిల్లలు తప్పనిసరిగా తీసుకోవాలని దాని వల్ల అనేక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని పిల్లల తల్లిదండ్రులకు పిల్లల వయసు తగిన బరువు ఎత్తు పెరుగుదల చార్ట్ గురించి సూపర్వైజర్ రాజ్యలక్ష్మి తెలియజేయడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం పై శ్రద్ధ చూపించాలని పరిశుభ్రతను పాటించాలని ప్రైమరీ స్కూల్ టీచర్ సుజాత తెలియజేశారు .ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఇందిరా, వినోద ఆయాలు తల్లులు , ఏ ఎల్ ఎం ఎస్ సి కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.
Attachments area