అంగన్వాడీ కేంద్రాల్లో సామూహిక శ్రీమంతాలు

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్)

మండల పరిధిలోని హేమ్లాతండా గ్రామపంచాయితి పరిధిలోని అంగన్వాడీ కేంద్రం1,కేంద్రం2,జగ్గూతండా కేంద్రాలలో సామూహిక శ్రీమంతాలు నిర్వహించినట్లు అంగన్వాడీ టీచర్ భూక్యా నీలా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.ఐరన్ మాత్రలు, తక్కువ ఖర్చుతో దొరికే ఆకు కూరలు, పాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు.గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిండం పెరుగుదల ఎక్కువగా ఉంటుందన్నారు.ఈకార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జయమ్మ, జ్యోతి, ఆయాలు కవిత, సుజాత, లక్ష్మీ, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.