అంగరంగ వైభవంగా తిరుమలలో బ్ర¬్మత్సవాలు
సింహవాహనంపై ఊరేగిన శ్రీవారు
తిరుమల,సెప్టెంబర్15(జనంసాక్షి): తిరుమలలో బ్రహ్మాండ నాయకుని బ్ర¬్మత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్ర¬్మత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. బ్ర¬్మత్సవాల మూడో రోజు ఉదయం స్వామివారు సింహ వాహనంపై విహరించారు. దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సంకేతం సింహ వాహనం. జగన్నాయకుడి అవతారాల్లో నాలుగోది నృసింహ అవతారం. సింహ బలమంత భక్తిభావం కలిగి ఉన్నవారికి స్వామి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. శౌర్య ప్రతాపాలకు ప్రతీకగా నిలిచే సింహాన్ని తన వాహనంగా మలచుకుని తిరువీధులలో స్వామివారు విహరించారు. యోగ నృసింహునిగా సింహ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారిని చూసి భక్తులు పులకించిపోయారు. అరణ్యాల్లోని క్రూర మృగాల్లో బలమైన సింహం.. మనిషి సంసార సాగరాన్ని దాటడానికి తన నామస్మరణెళి నావలాగా ఉపయోగపడితే… మనస్సునే…అలోచనలనే కీకారణ్యంలో మనిషిని అధః పాతాళానికి తోక్కేసే ఎంతటి దుర్మాగానికైనా ఓడిగట్టేలా చేసే క్రూరమైన సింహాల్లాంటి అలోచనల నుండి తాను మాత్రమే కాపాడగలనని స్వామి ఈ వాహనసేవ ద్వారా తెలియజేస్తున్నారు. మరోవైపు శ్రీనివాసుడి అలయంలో గర్భగుడి నాల్గువైపులా అమ్మవారి వాహనమైన సింహం ఇక్కడే కనిపిస్తుంది. తనను నమ్మినా… తన హృదయంలోని అమ్మవారిని ప్రార్ధించినా ఒక్కటేనని అమ్మ వాహనాన్ని తన వాహనంగా చేసుకోని స్వామివారు చతుర్మాడావీధుల్లో దర్శనమిస్తారు. దుష్టశిక్షణ… శిష్టజన రక్షణకు ఈ వాహనసేవను ప్రతీకగా భావిస్తారు.