అంగరంగ వైభవంగా శ్రీ కట్ట మైసమ్మ విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం. మూడు రోజులపాటు కొనసాగనున్న పూజా కార్యక్రమాలు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నా ఎ ఏం సి చైర్మన్ విట్టల్ నాయక్ భక్తులు.

తాండూరు పట్టణంలో వెలిసిన శ్రీ కట్ట మైసమ్మ విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం అంగరంగా వైభవంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పాత కుంట ఆదర్శనగర్ లో వెలసిన శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహం పునః ప్రతిష్ట ఆలయ ప్రధానార్చకులు శివశ్రీ జంగం చంద్రకాంత్ స్వామి వైదిక అలంకరణ విభూషితరత్న మరియు వారి శిష్య బృందము ఆధ్వర్యంలొ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా ఉదయం పట్టణంలోని శ్రీలక్ష్మి థియేటర్ సమీపంలోని శ్రీ తుల్జా భవాని ఆలయం నుండి అమ్మవారి విగ్రహం ఊరేగింపు కార్యక్రమం శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయం వరకు పోతురాజు విన్యాసాలు ఆటపాటలతో కనుల పండుగగా జరిగింది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో తాండూర్ మార్కెట్ చైర్మన్ విటల్ నాయక్ తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. దేవాలయంలో శ్రీ కట్ట మైసమ్మ విగ్రహం కలశం సింహం ,నాగులు బలిపీఠం 25 కేజీల గంట విరాళాల దాతలు నరేష్ గోనిలకంఠం రాములు సంధ్య భార్గవి లక్ష్మి సుధాకర్ అంజిలయ్య గిర్జాపురం మైక్ సెట్ దాత గౌతమ్ కుమార్ పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటు కార్యక్రమాలు 8 9 10 మూడు రోజులపాటు జరగనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు వర్త్యవిట్టల్ నాయక్ గారు (మార్కెట్ కమిటి చైర్మన్)అధ్యక్షులు జె. సుధాకర్ ఉపాధ్యక్షులు కె.వేణుగోపాల్,ప్రధాన కార్యదర్శి సుధాకర్ (మెకానిక్),కార్యదర్శి కె. కృష్ణ,కోశాధికారి, రాముల,ముఖ్య సలహాదారులు నల్ల పాపయ్య, ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్, పట్నం రమేష్, యం.రాజేష్, కె.నర్సింలు, బెజ్జురమేష్ అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు