అంటువ్యాధులు సోకకుండా చర్యలు 

వరంగల్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జిల్లాలో వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రధానంగా నగరంలో నీటి నిల్వ ఉన్నచోట తక్షణం బ్లీచింగ్‌ చల్లాలన్నారు. వైద్యాధికారులు పరిస్థితిని సవిూక్షించి అంటువ్యాధుల బారిన ప్రజలు పడకుండా చూడాలన్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు ఇదిలావుంటే దోమలవ్యాప్తి కారణంగా డెంగీ కేసులు పెరుగుతన్నాయన్న ఆందోళన కనిపిస్తోంది. ఎంజీఎం ఆసుపత్రిలో రోజురోజుకు డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.  ప్రైవేటులో, ప్రభుత్వ వైద్యశాలలో డెంగీ పరీక్ష చేసే విధానం వేరుగా ఉంటుంది. ప్రైవేటులో స్టిప్ర్‌ పద్ధతిలో చేస్తారు. త్వరగా నివేదిక వచ్చేస్తుంది. ప్రభుత్వం ఎలిజా పద్ధతిలో చేశాక డెంగీ సోకితేనే నిర్ధరిస్తారు. రోగులతో జ్వరాల వార్డు కిటకిటలాడుతోంది. దీంతో పలువురు హైదరాబాద్‌ లాంటి నగరాలకు చికిత్స కోసం వెళుతున్నారు.

తాజావార్తలు