అంతకపేటలో విషజ్వరంతో 5నెలల చిన్నారి మృతి

హుస్నాబాద్‌: మండలంలోని అంతకపేట గ్రామానికి చెందిన ఐదు నెలల చిన్నారి విష జ్వరంతో మృతి చెందినది. పంజాల ప్రమోదు, రేవతి దంపతుల కూతురును మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో కరీంనగర్‌ ప్రతీమ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ మృతి చెందింది.