అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్ట్

50కిలోమీటర్లు రెండున్నర గంటలు దొంగలను వెంబడించి పట్టుకున్న పోలీసులు
కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి
జుక్కల్, సెప్టెంబరు 27, (జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామము నందు ఒక ఆవు, జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఆవులు ఆదివారంరాత్రి దొంగిలించ బడ్డాయని,ఈ ఆవులను దొంగించిన కరడుగట్టిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యుడిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన మద్నూర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.ఈముఠా లో ఇంకా ఆరుగురు సభ్యులు ఉన్నారని వారందరినీ త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. వారిపెర్లు వరుసగా జావీద్ 30, హాజర్ 25, ఆబీద్ 41, షబ్బీర్ 45, ఇజ్రాయిల్ ఉన్నాయని తెలిపారు.ఈ ముఠాకు
షబ్బీర్ నాయకత్వం వహిస్తున్నాడని ఎస్పీ తెలిపారు.
ఆవులు దొంగిలించిన వారిని పట్టుకోవడానికి మద్నూర్ ఎస్సై శివకుమార్, జుక్కల్ ఎస్సై బాల్ రెడ్డి సిసి కెమెరా పుటేజి లను పరిశీలించారని తెలిపారు. టాటా టెంపోలో ఈ ఆవులను దొంగలు తీసుకెళ్లినట్లు గుర్తించారు.ఇట్టి నేరస్థులను పట్టుకోవడానికి బిచ్కుంద సీఐ క్రిష్ణ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి పెట్రోలింగ్ చేపట్టారు. ఇలా నేరస్తుల గురించి పెట్రోలింగ్ చేస్తున్న క్రమములో సోమవారం అర్ధరాత్రి సొనాల రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు ఉదయం ఒంటి గంట సమయములో టాటా టెంపో అనుమానాస్పదంగా నిలబడి ఉంది.దానిని చెక్ చేయటానికి వెళ్లిన పిసి విట్టల్ హెచ్ సి శంకర్ లపై నేరస్తులు తమ వద్ద ఉన్న రాళ్లతో దాడిచేసినారు. అక్కడే పోలీసు వాహనము ముందు అద్దము పగిలినది. నేరస్తులు వారి వాహనము స్టార్ట్ చేసి పెద్ద తడుగూరు వైపు పారిపోతుండగా ఇట్టి విషయం మద్నూర్ ఎస్సై శివకుమార్ కు తెలుపగా, ఆయన వెంటనే కొద్దీ దూరం వెళ్లి పెట్రోలింగ్ వాహనము వారితో కలిసి నేరస్తుల వాహనమును . దాదాపు 10 కిలోమీటర్లు వదలకుండా వెంబడిస్తూ ఉండడముతో నేరస్తులు పోలీసు వాహనము పై రాళ్ళూ రువ్వుతూ మరల మద్నూర్ వైపు పారిపోవడానికి ప్రయత్నిoచి పెద్ద తాడగూరు చౌరస్తా దగ్గర వారి వాహనం ఆపి వారి వెనక వస్తున్న
పోలీసు వాహనం వైపు స్పీడ్ గా వచ్చి పోలీసు వాహనాన్ని టక్కరి ఇచ్చినారు. వెంటనే ఆత్మ రక్షణ కొరకు మద్నూర్ ఎస్సై శివ కుమార్ తన సర్వీస్ పిస్తోల్ తో (6) రౌండ్ల ఫైర్ చేసినారు. భయపడిన నేరస్తులు వారి వాహనాన్ని దెగ్లూర్ వైపు మార్చినారు. వెంటనే ఎస్ఐ విషయాన్ని దెగ్లూర్ మరికల్ పోలీసులకు తెలిపారు. వెంబడిస్తున్న మన పోలీసు వాహనంను దెగ్లూర్ కరేగావ్ వద్ద రెండవసారి మరలా టక్కరి ఇవ్వడంతో పోలీస్ వాహనం అక్కడే నిలిచిపోయింది.
వెంట ఉన్న మరో పోలీసు పెట్రోలింగ్ వాహనంలో కి ఎస్సై శివకుమార్, సిబ్బంది ఎక్కి అలానే వెంబడించారు. మరికల్ పోలీస్ వారు కర్రలు, రాళ్లు రోడ్డుకు అడ్డం పెట్టగా నేరస్తులు వాటిపై నుండి ఎక్కించుకొని తప్పించుకొని పారిపోయారు. తదుపరి మరికల్ పోలీసు వారు హనేగావు వెళ్లేదారిలో రెండు కంటైనర్లు అడ్డం పెట్టినారు. ఎక్కడ తప్పించుకోవడానికి మార్గం లేకపోవడంతో మరికల్ పోలీసు వాహనoను మరల టక్కరి ఇచ్చి, వారి వాహనాన్ని నిలిపి, వారి వద్ద ఉన్నమారణాయుధాలు, రాళ్లతో పోలీస్ వారిపై దాడి చేస్తూ పారిపోయే ప్రయత్నం చేసినారు. అయినప్పటికిని ఎలాగైనా నేరస్తుల పట్టుకోవాలనే అకుంఠిత దీక్షతో పోలీసు వారు ప్రయత్నించి ఒక నేరస్తుడిని, వారి వాహనాన్ని పట్టుకున్నారు.వాహనంలో ఒక ఆవు , కత్తులు, రాళ్ళు,ఉన్నాయి.ఈనేరస్తుడిని పట్టుకోవడంలో దైర్యసాహసాలు ప్రదర్శించిన మద్నూర్ ఎస్సై శివకుమార్, పెట్రోలింగ్ సిబ్బంది బి విఠల్, జి. శంకర్ లకు ఎస్పీ పదివేల నగదు పురస్కారం అందజేశారు. అలాగే దొంగలను పట్టుకోవడంలో సహకరించిన మహరాష్ట్ర కు చెందిన దెగ్లూర్ , మర్కల్ఎస్సైలు సోహల్, విష్ణులకు ఎస్పీ అభినందించారు.