అంతర్జాతీయంగా పత్తికి మళ్లీ డిమాండ్‌


చైనా వరదలతో ఆ దేశంలో తగ్గిన సాగు
దేశీయంగా మద్దతు ధరలు లభించే అవకాశం
హైదరాబాద్‌,ఆగస్‌ట్ట26(జనంసాక్షి): అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి నూలుకు డిమాండ్‌ పెరగడంతో పాటు ఉభయ తెలుగు రాష్టాల్ల్రో మరోమారు పత్తికి రైతులు సుముఖత వ్యక్తం చేసి పంటలను వేశారు. తెలంగాణ ప్రభుత్వం పత్తిని సాగు చేయాలని కోరింది. అదేపనిగా వరి కాకుండా వాణిజ్య పంటలు వేయాలని
సూచించింది. పత్తి సాగుతో లాభాలు వస్తాయని సిఎం కెసిఆర్‌, మంత్రులు కూడా ప్రచారం చేశారు. దీనికితోడు చైనాలాంటి దేశాలలో వరదల కారణంగా సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోవడంతో ధరల పెరుగుదలకు అసలు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ధర మద్దతు మించితే రైతులు బయట మార్కెట్‌లో ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించేందుకే మొగ్గుచూపుతారు. దీంతో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసిన ఆశించిన ఫలితం ఉండదంటున్నారు. తేమ, నాణ్యత పేరిట ప్రైవేట్‌ వ్యాపారులు కోతలు విధిస్తే నష్టపోయే అవకాశాలు లేకపోలేదు. ఈసారి పత్తి దిగుబడులు భారీగా
పెరుగనున్నాయి. ఎకరాన 6 నుంచి 8 క్వింటాళ్ల అంచనాతో ఉన్నారు. ఒక్క ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 28లక్షల క్వింటాళ్ల పంట దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే పంటల సాగు వివరాలను సేకరించిన వ్యవసాయ శాఖ అధికారులు మార్కెటింగ్‌, సీసీఐ ప్రభుత్వానికి అంచనా నివేదికను అందజేశారు. దీని ఆధారంగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది సీసీఐ ఆధ్వర్యంలో 25లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ఈసారి అదనంగా 3లక్షల క్వింటాళ్ల వరకు పంట దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటు న్నారు. అందరూ భావిస్తున్నట్లుగా పత్తి ధర మద్దతు మించితే సీసీఐ సంస్థ పత్తిని కొనుగోలు చేయడం అనుమానంగానే కనిపిస్తుంది. ఈ ధర క్వింటాల్‌కు రూ.6025 ఉన్న ఈసారి మాత్రం రూ.7వేల వరకు ధర పలికే అవకాశం ఉందని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి భారీ డిమాండ్‌ ఉండడంతో ముందే అప్రమత్తమైన పత్తి వ్యాపారులు రైతుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కవిూషన్‌ ఏజెంట్ల ద్వారా ముందుగానే అడ్వాన్సులను చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. గ్రామాల్లో మోతుబోరు రైతుల సహకారంతో అడ్వాన్సులు ఇస్తూ ఒప్పందం చేసుకుంటున్నారు. ఎకరానికి 6 నుంచి 8 క్విం టాళ్ల పత్తి దిగుబడులు వ చ్చే అవకాశం ఉన్న రైతులకు 3, 4 క్వింటాళ్ల పంటలకు అడ్వాన్సుల రూపంలో డబ్బులు ముట్ట చెబుతున్నారు. క్వింటాళుకు రూ.6200ల నుంచి రూ.7వేల వరకు చెల్లిస్తున్నారు. పంట చేతికి రాకపోతే పైసలు అందడంతో అన్నదాతల్లో ఆనందం కనిపిస్తుంది. మునుపెన్నడు లేని విధంగా ఈసారి పంటకు భారీగా ధరలు పెరగడంతో వ్యాపారులు అప్రమత్తమై కొనుగోలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.