అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా బసవతారకం ఆసుపత్రి
నందమూరి బాలకృష్ణ
హైదరాబాద్ : బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తామని ఆసుపత్రి ట్రస్టు ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇటీవలే ఈ ఆసుపత్రి జాతీయ స్థాయిలో నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ గుర్తింపు సాధించిందని చెప్పారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు నర్సింగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అక్రిడేషన్ సాధించిన తొలి ఆసుపత్రి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రేనని ట్రస్టు వర్గాలు తెలిపాయి.