అంతా కలిసే పనిచేస్తున్నాం..
‘మాలో గ్రూపుల్లేవు.. అంతా కలిసే పనిచేస్తున్నాం” అంటూ రెండు వర్గాల నేతలూ పోటీపడి మరీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీదర్‌రావు ఎదుట ఐక్యరాగం వినిపించారు. అంతా పత్రికల సృష్టి అని, కలిసే పనిచేస్తున్నాం అని అక్కసునంతా పత్రికలపై, కాంగ్రెస్‌పై వెళ్లగక్కారు. కానీ ఈ సన్మానం సాక్షిగా పార్టీలో గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి. కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు వర్గం సభకు హాజరైనా సన్మానానికి దూరంగా ఉండడం, బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్‌ని వేదికపైకి ఆహ్వానించకపోవడం పార్టీలో విభేదాలను బహిర్గతం చేసింది. పార్టీ కార్యకర్తల్లో మాత్రం మురళీధర్‌రావు రాక కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు. ఆయనను సన్మానించేందుకు నాయకులు, కార్యకర్తలు పోటీపడడం కనిపించింది. ఇందులో గుజ్జుల రామకృష్ణాడ్డి వర్గం, సుగుణాకర్‌రావు అనుచరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.