అంతుబట్టని వ్యాధితో ముగ్గురు చిన్నారుల మృతి
ఉట్నూరు: అదిలాబాద్ జిలల్లా ఎజెన్సీలో అంతుబట్టని వ్యాధితో ముగ్గురు చిన్నారులు ఒకే రోజు మృతి చెందారు. నీలాగొంది గ్రామానికి చెందిన లక్ష్మణ్(6), సోనాదేవి(10), జయనూరు మండలం జాడుగూడకు చెందిన శాంతాబాయి(6) అకస్మాత్తుగా ఈరోజు చనిపోయారు. ఇందులో లక్ష్మణ్, సోనాదేవిలు అక్కా తమ్ముళ్లు వీరి తల్లి దండ్రులు శ్రీరాంప్రభు, సత్తుబాయిలు వ్యవసాయ కూలీలు శాంతాబాయి తల్లీ దండ్రులు భీం, గంగూబాయిలు కూడా వ్యవసాయ కూలీలే. విషయం తెలిసిన తరువాత అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలను ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ పరామర్శించారు.