అంబరాన్ని అంటిన బతకమ్మ సంబరాలు_

*ఉద్యోగస్తులతో కలిసి స్టెప్పులేసిన ఎంపీపీ,
ఖానాపురం సెప్టెంబర్ 29జనం సాక్షి
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నడూలేని ఉత్సవం గురువారం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ఆధ్వర్యంలో అన్ని శాఖల మహిళ ఉద్యోగులు వారి శాఖల అకృతులను బట్టి పేర్చిన బతకమ్మలతో మండల పరిషత్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన బొడ్డెమ్మ ముందు డీజే పాటలతో మహిళ ప్రజాప్రతినిధులతో కలిసి అన్ని శాఖల ఉద్యోగులు స్టెప్పులేసి ఘనంగా బతకమ్మ ఉత్సవాలు నిర్వహించారు.ఎంతో ఆనంధోస్సవాలతో మహిళమణులు బతకమ్మ ఉత్సవాల్లో పాల్గొనగా పక్కనే ఉన్న వారికి చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తపరిచారు.ఈ వేడుకల్లో ఎంపీడీవో సుమనవాణి,వైస్ ఎంపీపీ రామసహయం ఉమరాణి,పీహెచ్ సి డాక్టర్ మాల్యాల అరుణ్ కుమార్, వెటర్నరీ డాక్టర్ శ్రీలక్ష్మి,ఏపీఎం సుధాకర్, టి.ఆర్.ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య,మహిళ అధ్యక్షురాలు కుందనపెళ్లి శైలజ,మహిళ సమైక్య అధ్యక్షురాలు పోలోజు కవిత,మహిళసర్పంచులు భూక్య పద్మ, శాఖమూరి చిరంజీవి, ఎంపీటీసీ లు  మర్రి కవిత,బోడ భారతి,షేక్ సుభాన్ బీ,సొసైటీ డైరెక్టర్ వేములపల్లి సునీత,ఉప సర్పంచులు,గ్రామపార్టీ అధ్యక్షులు,పార్టీ నాయకులు,యూత్ నాయకులు పాల్గొన్నారు.