అంబెడ్కర్ ఆశయాలను సాధించాలి

*వివక్ష రూపుమాపినప్పుడే అభివృద్ధి
*మిర్యాలగూడ లో నృత్యరూప నాటకం
మిర్యాలగూడ. జనం సాక్షి
మిర్యాలగూడ పట్టణంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో సంఘం చరణం గచ్చామి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  నాటకను వారి జీవిత చరిత్రను కొంత భాగం నృత్యరూపకం నాటకం రూపంలో సోమవారం రాత్రి  ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ సమాజంలో వివక్షత రూపంలో కులాల మధ్యన మతాల మధ్యన వివక్షత చూపించి మనుషులను విడదీసే పద్ధతుల్లో మనువాద సంస్కృతి మనసంప్రదాయాన్ని ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం చూపిస్తుందని  అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ వెనుకబడిన తరగతులకు న్యాయం కోసం ఆనాడు నుండి అనేక పోరాటాలు అనేక వివక్షతలకు గురైనటువంటి మహానుభావుడు అంబేద్కర్ జీవితంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి అంబేద్కర్ చదివిన  చదువు   ప్రపంచ మేధావిగా గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు ఈనాడు మతం పేరుతో కులం పేరుతో విడదీస్తున్నటువంటి నాయకులు రాజకీయ లబ్ధి కోసమే ఇవ్వాలా ఎస్సీ కులాలకు చెందినటువంటి వాళ్లను వాడుకుంటున్నారని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని అన్నారు.. ఈ ప్రపంచానికి మార్చ్ అనే మేధావి కార్మికులకు కర్షకులకు వెనుకబడిన తరగతులకు ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శన్ని చూపించారన్నారు. దళితులపై జరుగుతున్నటువంటి దాడులను ఎండగట్టాలని కోరారు. అందరికీ కూడు గుడ్డ వైద్యం విద్య ప్రజలందరికీ అందిన్నాడే అంబేద్కర్ ఆశయాలు సాధించినట్టుగా అవుతుందని చెప్పారు. ….. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దోస్పాటి శ్రీను ఎస్సీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మాడుగుల శ్రీను. కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరశురాములు. కెవిపిఎస్ సీనియర్ నాయకులు జిల్లా కమిటీ సభ్యులు కోడిరెక్క మల్లయ్య. కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు దైద దేవయ్య. కోడి రెక్క రాధిక.దైద జనార్ధన్. వెంకటయ్య తక్కెలపల్లి ఏసుబాబు. బొల్లంపల్లి పాపారావు. రవి.తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు