*అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి.
చిట్యాల సెప్టెంబర్ 21(జనంసాక్షి) భారత రాజ్యాంగ రచయిత బాబా సాహేబ్ అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాలలోని యువత ముందుకు రావాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు దొడ్డి కిష్టయ్య, మైస రమేష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 1033 /77, ఈ నెంబర్ 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య అద్యక్షతన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ కులాలకు చెందిన వారు కలిసి కట్టుగా ఐక్యంగా లేక పోతే రాబోయే రోజుల్లో వారు అనేక ఇబ్బందులు పడుతారని, దాడులు, దౌర్జన్యాలు అవమానాలు మహిళలపై అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయని తెలిపారు .ఇప్పటి నుంచే దళితలు రాజ్యాధికారం చేపట్టుటకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్, జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ ,జిల్లా, మండల నాయకులు సంపత్, గుర్రం రాజమౌళి, గురుకుంట్ల కిరణ్, ఆరేపల్లి నర్సింహ రాములు, పుల్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.