అకాల వర్షంతో మామిడి తోటలకు రూ.5లక్షలు తీవ్ర నష్టం

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో సోమవారం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. తిమ్మాపూర్‌లో ముదిరాజ్‌ సంఘానికి చెందింన ఆరన్నర ఎకరాలు, దమ్మన్నపేటలో రైతులు హనుమంతురెడ్డి, సాయిరెడ్డి, లక్ష్మిలకు చెందిన 11ఎకరాల మామిడితోటలు ఈ వర్షానికి పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాదాపు రూ. 5లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. అలాగే బండలింగంపల్లిలో పిడుగుపాటుకు రెండు తాటి చెట్లు నేలకూలాయి. పలు చోట్ల వరి గింజలు నేలరాలాయి.