అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం…..
భారీ వర్షానికి తడిసి ముద్దవుతున్న ధాన్యం…
తూకం వేసిన ధాన్యం బస్తాలు ఎక్కడివక్కడే..
ఆరుగాలం కష్టపడిన రైతున్నకు కన్నీళ్లు..
చిలప్ చేడ్/మే/జనంసాక్షి :- ఆరుగాలం కష్టపడిన రైతన్నకు కన్నీళ్లు మిగిలించిన వరుణ దేవుడు భారీ వర్షానికి అతల కుతలమవుతున్న రైతన్నను ఆదుకునే దికేవరని తను పండించిన పంట ఎండకు ఎండి వానకి తడుస్తూ కళ్ళల్లోనే తడిసి ముద్దవుతున్న వరి ధాన్యం చిలప్ చేడ్ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం నాడు మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దవుతున్న వరి ధాన్యం కుప్పలు తూకం వేసిన బస్తాలకు సమయానికి లారీలు రాకపోవడంతో కళ్ళల్లోనే వర్షానికి తడిసి ముద్దవుతున్న ధాన్యం బస్తాలు గత మూడు నాలుగు రోజులుగా తూకం వేసిన బస్తులు కళ్ళల్లోనే తడిసి ముద్దవుతున్నాయి లారీలు సమయానికి రాక పోవడంతో సంబంధిత అధికారులను సంప్రదించగా లారీలు ఉన్నాయి కానీ సమయానికి రైస్ మిల్లులో గాని గోదాంలలో గాని సమయానికి ధాన్యం బస్తాలు ఖాళీ కావడం లేదని అక్కడ లేబర్ ప్రాబ్లం ఉందని చెబుతున్నారు కానీ కొందరు రైతులు ధాన్యం లారీల వెంబడి వెళ్లి లారిలోని బస్తాలు కాలి చేస్తామన్న గోదాములలో పట్టించుకునే నాధులే లేరని రైతులు వాపోతున్నారు తను ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం సమయానికి తూకం వేయక కొంత తూకం వేసిన బస్తాలు సరైన సమయానికి తీసుకువెళ్లలేక వర్షానికి తడిసి ముద్దవుతున్న వరి ధాన్యం అధికారుల నిర్లక్ష్యంతో ఆగమైతున్న అన్నదాతలు ఇప్పటికైనా సంబంధిత అధికారులు తడిసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు