అక్టోబర్ లేదా నవంబర్‌లో డీఎస్సీ: పార్థసారథి
హైదరాబాద్, జనంసాక్షి: టీచర్ పోస్టులు ఆశిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. త్వరలో ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్ లేదా నవంబర్‌లో డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. టెట్, డీఎస్సీ రెండు వేర్వేరుగా నిర్వహించాలా అనే దానిపై నిపుణులతో జరుపుతున్నామని మంత్రి తెలిపారు. ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.