అక్టోబర్ 2న మునగాలలో బతుకమ్మ చీరలు పంపిణీ
మునగాల, సెప్టెంబర్ 29(జనంసాక్షి): అక్టోబర్ 2న అన్ని గ్రామాలలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని మునగాల గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉడుం కృష్ణ తెలిపారు. గురువారం మునగాల మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ్రామ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. బతుకమ్మ పండుగ మహోత్సవంలో ఆడపడుచులు అందరూ ప్రభుత్వం ఇచ్చిన చీరలతో బతుకమ్మ ఆటలను ఆడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అజయ్ కుమార్, మునగాల గ్రామ సర్పంచ్ చింతకాయల ఉపేందర్, పిఏసిఎస్ ఛైర్మన్ కందిబండ సత్యనారాయణ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉప్పుల యుగంధర్ రెడ్డి, గుండు అంజయ్య, ఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.