అక్టోబర్ 2న హెల్తీఫై హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం
సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి ):అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక జమ్మిగడ్డలోని హెల్తీఫై హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిభిరంను ఏర్పాటు చేసినట్లు హెడ్ ఆఫ్ ది హెల్తీ ఫై హాస్పిటల్ మతకాల చలపతి రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలిస్తున్న వేళా సూర్యాపేట పట్టణ ప్రజలకు హెల్తీ ఫై హాస్పిటల్ వారు అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 9 గంటల నుండి ఈ వైద్య శిభిరం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. క్రిటికల్ కేర్ వైద్యనిపుణులు డాక్టర్ గిరిధర్ నాయక్ , ఎముకలు, కీళ్ళ వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ , డాక్టర్ హరికృష్ణ , జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అపర్ణ , ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ ఉపేందర్ , ఆర్ఏంఓ డాక్టర్ కీర్తి , లాప్రోస్కోపీ సర్జన్
డాక్టర్ బిఎస్ రావు , న్యూరోసర్జన్ డాక్టర్ రఘునందన్ రావు ఈ వైద్య శిభిరంలో పాల్గొననున్నట్లు తెలిపారు.దీర్ఘకాల వ్యాధులు , నడుము నొప్పి , మోకాళ్ళ నొప్పులు, వెన్నుపూస నొప్పి , నరముల బలహీనత , కిడ్నీకి సంబంధించిన వ్యాధులు , షుగర్, బిపి లకు ఆరోగ్య పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈసిజి టెస్టులతో పాటు జ్వరం, బాడీ పెయిన్స్ కి సంబంధించి ఉచిత మెడిసిన్స్ అందిస్తామన్నారు.తమ హాస్పిటల్ నందు ల్యాప్రోస్కోపీ ద్వారా అన్ని రకాల సర్జరీలు చేయబడునని తెలిపారు.స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ఆరోగ్యశ్రీ , ఈహెచ్ఎస్, ఈఎస్ఐ సదుపాయం కలదని చెప్పారు.మరిన్ని వివరాలకు 9949641757 , O8684222757 , 7799009581 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.