అక్బర్ విడుదలపై వెలువడని ఉత్తర్వులు
ఆదిలాబాద్: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ మంజూరు కావడంతో నిర్మల్ కోర్టులో రూ. 25 వేల చొప్పున రెండు వూచీకత్తులను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తరపు న్యాయవాదులు సమర్పించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అక్బర్ పాస్‌పోర్టును సమర్పించకపోవడంతో ఆయన విడుదలపై ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు.