అక్రమంగా తరలిస్తున్న కలప పట్టుకున్న అటవీ శాఖ అధికారులు

భూపాలపల్లి : వరంగల్‌ జిల్లా భూపాలపల్లి మండలం చెలుకూరు ప్రాంతంలో అక్రమంగా కలపను వ్యాన్‌లో తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. కలప విలువ రూ. 70 వేలు ఉంటుందని అటవీ అధికారి సంజీవరావు తెలిపారు. కలపను కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టినట్లు తెలిపారు.