అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
సూర్యాపేట,సెప్టెంబర్28 (జనంసాక్షి): అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ సవిూపంలో సూర్యాపేట పట్టణ పోలీసులు, సీసీఎస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి 120 కిలోల గంజాయిని సీజ్ చేశారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ మోహన్ కుమార్ కేసు వివరాలు వెల్లడిరచారు. నిర్మల్ జిల్లా మామడ మండలం కిషన్‌రావు పేటకు చెందిన జాదవ్ అశోక్, ఏపీలోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం గౌరవపాలెంకు చెందిన బొడ్డు మల్లికార్జున్ రావు ఇద్దరు కలిసి విశాఖపట్నం చుట్టుపక్కల నుంచి తక్కువ ధరకు గంజాయిని సేకరించేవారు.
సేకరించిన గంజాయిని హైదరాబాద్, మహారాష్ట్రలో ఎక్కువ ధరకు అమ్మేందుకు కార్లలో తీసుకెళ్తున్నారు.
ఈ క్రమంలో పోలీసులు కొత్త బస్టాండ్ వద్ద తనిఖీల్లో భాగంగా వీరు కార్లను ఆపి ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పారు. వారి కార్లను సోదా చేయగా సుమారు 120 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .గంజాయిని పట్టుకున్న సీసీఎస్ సీఐ రాఘవరావు, పట్టణ ఇన్‌చార్జి సీఐ రాజేష్, ఎస్‌ఐ శ్రీనివాస్, నరేందర్‌రెడ్డి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు